టీడీపీ అబద్ధాల పునాదుల మీద బతుకుతోంది: మాజీ మంత్రి కన్నబాబు

కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కన్నబాబు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు కన్నబాబు.రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని... 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు...  పచ్చిఅబద్ధాలు ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. టీడీపీ అబద్దాల పునాదుల బతుకుతోందని అన్నారు.

రుషికొండ భవనాల విషయంలో ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని.. మోసపూరిత హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారని.. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదని అసెంబ్లీలో సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని అన్నారు కన్నబాబు. చంద్రబాబు మాటలు నమ్మి వాలంటీర్లు మోసపోయారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. 

ఇంతగా అబద్దాలు ప్రచారం చేయటానికి కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు కన్నబాబు. గత అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లను కొనసాగిస్తామన్నారని... ఈ సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని అంటున్నారని అన్నారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్తున్న చంద్రబాబు మే నెల వరకు వాళ్లకు జీతాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు కన్నబాబు.