మెడికల్ కాలేజ్ కు కొత్త కోర్సులు మంజూరు : హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మెడికల్ కాలేజీకి కొత్తగా మరో మూడు పీజీ కోర్సులు మంజూరైనట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

కాలేజీలో ఇప్పటికే 13పీజీ కోర్సులు, 58 సీట్లు ఉండగా మరో మూడు కోర్సులు మంజురుకావడంతో మొత్తం 16 పీజీ కోర్సులకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. కొత్తగా అన స్తీషియా 6, పిడియాట్రిక్ 4, డెర్మాటలాజీ లో 4 పీజీ సీట్లు మంజూరైనట్టు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త పీజీ కోర్సులు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.