ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తాం: మాజీ మంత్రి హరీష్రావు

సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఆదివారం జరిగిన బీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతం హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్ల కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 

రైతుబంధులు, బోనస్ అంశాల్లో రైతులు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. లగచర్లలో భూ నిర్వాసితుల అంశం, అనంతరం జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. దళితులు, గిరిజనులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు నిలిపివేశారని అన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పనులుపై కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు హరీష్ రావు.

ALSO READ | ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు : రాహుల్ ​రాజ్​