రైతు ఉద్యమానికి ముందు జగన్ కు షాక్ : విశాఖ మాజీ, సీనియర్ మంత్రి రాజీనామా

వైసీపీ అధినేత జగన్ కు మరో షాక్ తగిలింది.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి కీలక నేతలంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు అవంతి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు అవంతి. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు అవంతి.  

2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుండి అవంతి శ్రీనివాస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఇవాళ ( డిసెంబర్ 12, 2024 ) పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు అవంతి. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు అవంతి . చిరంజీవి ఆశీస్సులతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని..నాగబాబు, చిరంజీవి వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు అవంతి.

ALSO READ : సంక్షోభంలోనూ సమర్థవంతంగా పాలించటం చంద్రబాబుకే సాధ్యం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తన రాజకీయ జీవితంలో నయాపైసా అవినీతికి కూడా పాల్పడలేదని.. ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని అన్నారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని.. 6 నెలలకె దాడికి దిగటం సరికాదని అన్నారు అవంతి. పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు గౌరవం కొరవడిందని అన్నారు. అందరిని అడగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు అవంతి.