జాతిని ఒక్కటి చేయడమే అలాయ్​బలాయ్​ ఉద్దేశ్యం : మాజీ మంత్రి హరీశ్​రావు

  • మాజీ మంత్రి హరీశ్​రావు

జోగిపేట, వెలుగు: తెలంగాణ జాతిని ఒకటి చేయడమే అలాయ్​బలాయ్​ఉద్దేశ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సోమవారం ఆయన ఆందోల్​మండలంలోని సంగుపేట వద్ద ప్రైవేట్​పంక్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు చాలా ప్రత్యేకత ఉందన్నారు. 

తెలంగాణ ప్రజలకు మాత్రమే పువ్వులను పూజించే సంస్కృతి ఉందన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రైతు బంధు, రుణమాఫీ ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు.  ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని  ప్రశ్నించారు. కార్యక్రమంలో  మధుసూదనచారి, దేవీప్రసాద్, బాలకిషన్, శ్రీనివాస్, మాణిక్​రావు, మాజీ  జడ్పీ చైర్​పర్సన్​మంజూశ్రీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.