చంద్రబాబు మాటలకు అర్థాలే వేరు: అంబటి రాంబాబు

సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా తాను నిజాయితీ పరుడని చెప్పుకుంటున్నారని అన్నారు. ఆయన చెప్పేదొకటి, చేసేదొకటి అని అన్నారు. చంద్రబాబు 6నెలల్లో రూ. 1 లక్ష 20వేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు విశ్వాస ఘాతకుడని.. అబద్దాలు చెప్పడంలో దిట్ట అని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసి 6 నెలలుగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు అంబటి. సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు కక్ష కట్టారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని.. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు అంబటి.

ALSO READ | ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన

కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని అన్నారు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు అంబటి. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. ఇచ్చిన హామీలను అమలు చేసిన దాఖలా ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిచారు అంబటి. చంద్రబాబు అబద్ధాలన్నీ లెక్కిస్తే గిన్నీస్ బుక్ లో ఎక్కించడం ఖాయమని అన్నారు.దేశంలో ఎక్కడా లేనంతగా ఎన్నికలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అని ఒక సంస్థ ప్రకటించిందని... ఇది ఆయన అక్రమ సంపాదనకు నిదర్శనమని అన్నారు అంబటి.