అదానీ చంద్రబాబును కలిస్తే గొప్ప, జగన్ ను కలిస్తే తప్పా..?: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

అదానీ ముడుపుల అంశం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఈ అంశంపై కూటమి సర్కార్ కు కౌంటర్ ఇవ్వగా.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబును అదానీ కలిస్తే గొప్పగా చెప్పుకున్నారు, జగన్‌ను అదానీని కలిస్తే మాత్రం దుష్ప్రచారం చేశారని అమండిపడ్డారు అమర్నాథ్.

సెకీతో పలు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని.. తక్కువ రేటుకు మన రాష్ట్రమే ఒప్పందం కుదుర్చుకుందని స్పష్టం చేశారు అమర్నాథ్. జగన్‌ ఒప్పందం తప్పయితే.. రద్దు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు అమర్నాథ్. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు.

కాగా.. అదానీ అవినీతి కేసులో జగన్ ప్రమేయం ఉందంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన జగన్ గురువారం ( నవంబర్ 28, 2024 ) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. అదానీ నుండి చంద్రబాబు కంటే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోళ్లు చేస్తే పొగడాల్సింది పోయి.. తిడుతున్నారని అన్నారు. తనకు ఎటువంటి సంబంధం లేని అదానీ అవినీతి కేసును తనకు అంటగట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ జగన్.. 48 గంటల్లో తనకు క్షమాపణ చెప్పకపోతే.. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.