జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే వేదికపై ప్రసంగిస్తూ షింజో అబే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో తుపాకీ పేలిన శబ్దం వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు షింజోపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న అబేను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా షింజో అబేలో ఎలాంటి కదలికలు లేవని స్థానిక మీడియా వెల్లడించింది. అనారోగ్య కారణాలతో ప్రధానమంత్రి పదవికి అబే రాజీనామా చేశారు.
Former Japanese Prime Minister Shinzo Abe collapsed during a speech in the city of Nara, in western Japan. Initial reports say he may have been injured. An NHK reporter on site heard something that sounded like a gunshot, and saw Abe bleeding: Japan's NHK WORLD News
— ANI (@ANI) July 8, 2022
Former Prime Minister Shinzo Abe has been shot in the city of Nara, reports Japan's NHK. pic.twitter.com/pw4TyCdArl
— ANI (@ANI) July 8, 2022
