ICICI స్కాంలో చందా కొచ్చర్‌కు బెయిల్

ICICI స్కాంలో చందా కొచ్చర్‌కు బెయిల్

ICICI బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచ్చర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్‌ మనీ లాండరింగ్ ముంబైలోని PMLA కోర్టు చందా కొచ్చర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు రూ. 5 లక్షల రూపాయల పూచీకత్తుతో కొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ముంబైలోని PMLA కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచ్చర్ ,ఆమె భర్త దీపక్‌, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెయిల్‌ కోసం ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా ఐసీఐసీఐ స్కాంలో ‍ చందా కొచ్చర్‌ వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచ్చర్ పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కూడా కేసు నమోదు చేసింది.2020 సెప్టెంబర్‌లో చందా కొచ్చర్‌ దంపతులను ఈడీ అరెస్ట్‌ చేసింది.