ఒమర్ అబ్దుల్లాను కలిసిన రవిశాస్త్రి

భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి.. జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిశారు. సోమవారం లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఫౌండర్, చైర్మన్ వివేక్ ఖుషాలానీతో కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఇంటికెళ్లిన రవిశాస్త్రి.. ఆయనను మర్యాదపూర్వకంగా పలకరించారు. కాబోయే ముఖ్యమంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

ALSO READ | T20 World Cup 2024: పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్

సీనియర్ ఆటగాళ్లు తలపడే లెజెండ్స్ లీగ్ టోర్నీ జమ్మూ కాశ్మీర్ వేదికగా జరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతున్న శ్రీనగర్‌లోని బక్షి స్టేడియాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత సందర్శించారు. ఆటగాళ్లతో కాసేపు మాటామంతీ జరిపారు. క్రికెటర్లను సాదరంగా తమ ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రవిశాస్త్రి.. ఒమర్ అబ్దుల్లా ఇంటికెళ్లినట్లు తెలుస్తోంది.

48 స్థానాల్లో కూటమి విజయం

ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి 48 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు.