టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. న్యూ ఇయర్ వేడుకల కోసం అజారుద్దీన్ బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్‌కు బయలుదేరారు. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కనున్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. కారు డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం కంట్రల్ తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అజారుద్దీన్ స్థానిక ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం.
