కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి :కేసీఆర్

  • మాజీ సీఎం కేసీఆర్ న్యూ ఇయర్​ విషెస్​

హైదరాబాద్, వెలుగు: కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులు, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుని, ఆశావహ దృక్పథంతో ప్రజలు తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 2025లో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ శాంతులతో జీవించాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలని, దాని ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన సూచించారు.