నిలకడగా మాజీ సీఎం బుద్ధదేవ్ ఆరోగ్యం

నిలకడగా  మాజీ సీఎం బుద్ధదేవ్ ఆరోగ్యం

పశ్చిమ బెంగాల్ మాజీ  సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. అయితే.. ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని... శ్వాస తీసుకోవడంలో ఇప్పటికీ కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్ పైనే ఉన్నారని తెలిపారు. ఆక్సిజన్ శాచ్యురేషన్ 92 శాతం ఉందన్నారు. 

77 ఏళ్ల  బుద్ధదేవ్ ఈనెల 18న కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పొడిదగ్గుతో కొంత బాధపడుతున్నారని.. ఆయన హార్ట్ బీట్ రేట్ 60గా ఉందని.. మిగిలినవన్నీ నార్మల్ గానే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఆయన భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా స్థిరంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఆమెకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను ఇచ్చామన్నారు. ఈ వారం మొదట్లో ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..మళ్లీ వెంటనే  ఆస్పత్రిలో చేరారు.