అదానీ లంచం కేసుతో నాకెలాంటి సంబంధం లేదు.. పరువు నష్టం దావా వేస్తా:ఏపీ మాజీ సీఎం జగన్

ప్రముఖ వ్యాపార వేత్త అదానీ లంచం కేసులో తన పేరుందన్న ప్రచారంపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. 

ALSO READ |తగ్గేది లేదంటున్న రామ్ గోపాల్ వర్మ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్.. విచారణ వాయిదా..

‘‘నేను అదానీని చాలా సార్లు కలిశాను..ఏపీ రాష్ట్రంలో అదానీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి.. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేస్తానని’’ హెచ్చరించారు.