Competitive Exams Special: తెలంగాణ అడవులు

  • ఒక ప్రాంత భౌగోళిక అటవీ విస్తీర్ణంలో 70శాతం పచ్చదనం ఉంటే వాటిని అత్యంత దట్టమైన అడవులుగా గుర్తిస్తారు. 
  • దేశంలో అటవీ సాంద్రత అధికంగా కలిగి రాష్ట్రం మిజోరాం. 
  • అటవీ సాంద్రత అత్యధికంగా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు.
  • దేశంలో అటవీ పెరుగుదలలో మొదటి మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా.
  • తెలంగాణ తలసరి అటవీ విస్తీర్ణం 0.08 హెక్టార్లు.
  • అంతరించిపోయే దశలో ఉన్న కలివికోడి ఇటీవల కాలంలో ఆదిలాబాద్​ అడవుల్లో కనిపించింది.
  • రాష్ట్రంలో నమోదిత అటవీ ప్రాంతాల విస్తీర్ణం 27,688 చ.కి.మీ.
  • తెలంగాణ రాష్ట్రంలో మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించిన అమీన్​పూర్​ చెరువును 2016లో గుర్తించారు. 
  • తెలంగాణలో అత్యంత నాణ్యమైన టేకు చెట్లు భద్రాచలం, పాల్వంచ, జన్నారం అటవీ ప్రాంతంలో లభిస్తాయి. 
  • డీగ్రేడ్​ అడవులు అధికంగా కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం.
  • ప్రపంచంలో అత్యంత నాణ్యత కలిగిన టేకు లభించే దేశం మయన్మార్​.
  • రాజ్యాంగంలోని 51వ ఆర్టికల్​ వన్యప్రాణి సంరక్షణ ఒక ప్రాథమిక విధి అని తెలియజేస్తుంది.
  • ఫరహాబాద్​ పులుల కేంద్రం నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఉంది.
  • తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటే జపాన్​లో అనుసరించే మియవాకీ పద్ధతిని ఆరో విడత హరితహారం నుంచి ప్రారంభించారు.
  • తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయాన్ని ములుగులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 
  • తెలంగాణకు హరితహారంలో భాగంగా పొలం గట్లపై టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సబాబుల్​ మొక్కలను నాటుతారు.
  • దేశంలో మొట్టమొదటి అటవీ గణన 1987లో జరిగింది.
  • ఫారెస్ట్​ సర్వే ఆఫ్​ ఇండియా 1985 వ సంవత్సరంలో ఏర్పడింది.
  • ఉష్ణమండల అడవుల పరిశోధనా కేంద్రం జబల్​పూర్​లో ఏర్పాటు చేశారు.
  • ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఆరిడ్​జోన్​ ఫారెస్ట్​ రీసెర్చ్​ జోధ్​పూర్​లో ఉంది.
  • ఫారెస్ట్​ ట్రైనింగ్​ ఇన్​స్టిట్యూట్​ డెహ్రాడూన్​లో ఉంది.
  • సమశీతోష్ణ సతత హరిత అరణ్యాల పరిశోధనా సంస్థ సిమ్లాలో ఉంది.
  • టెర్రర్​ ఆఫ్​ బెంగాల్​ అని గుర్రపుడెక్క లేదా బుడగ తామరను పిలుస్తారు. 
  • భారతదేశంలోని అడవుల్లో అధికంగా సాల్​ వృక్షాలు పెరుగుతాయి.
  • ఎయిర్​ కూలర్​ ప్యాడ్స్​ తయారీలో కుష్​కుష్​ గడ్డి జాతిని ఉపయోగిస్తారు.
  • మంచి గంధం అధికంగా కర్ణాటక రాష్ట్రంలో లభిస్తుంది.
  • వ్యవసాయ భూముల్లో పంటలతోపాటు వృక్షాల పెంపకాన్ని ప్రోత్సహించే విధానాన్ని ఆగ్రోఫారెస్ట్​ అంటారు.
  • దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
  • సిగరెట్​ పెట్టెల తయారీలో ఉపయోగించే కలప హల్దా.
  • చిప్కో ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్​లోని చమోలీ జిల్లాలో ప్రారంభమైంది.
  • 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులను రాష్ట్ర జాబితా నుంచి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. రికార్డెడ్​ ఫారెస్ట్​ కవర్​ అంటే చట్టం చేత నిర్ధారించబడని అడవుల్లోని చెట్ల సంఖ్యను తెలియజేస్తుంది.
  • అడవులను కారుచిచ్చు నుంచి రక్షించుకునేందుకు ప్రవేశ పెట్టిన సాఫ్ట్​వేర్​ ఫారెస్ట్​ అలార్మింగ్​ జనరేటింగ్​ సిస్టం.
  • ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం పదో స్థానంలో ఉంది.
  • అగ్గిపెట్టెల తయారీలో సిల్వర్​ ఫిర్​ కలపను ఉపయోగిస్తారు.
  • సారా తయారీకి ఉపయోగించే విప్ప పువ్వు అమ్రాబాద్​ ప్రాంతంలో అధికంగా  లభిస్తుంది.
  • లక్కను అధికంగా అందించే రాష్ట్రం జార్ఖండ్​.