అక్రమంగా తరలిస్తుండగా అలుగు స్వాధీనం

  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్  ఆఫీసర్లు

అమ్రాబాద్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న అలుగును ఫారెస్ట్  అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లోని మద్దిమడుగు రేంజ్  పరిధి కృష్ణా నది సమీప అడవుల్లో సంచరించే అలుగును కొందరు ముఠాగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్  అధికారులు అచ్చంపేట మండలం హాజీపూర్  సమీపంలో అలుగును స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వీరిని విచారించగా.. హైదారాబాద్  అడ్డాగా వన్యప్రాణుల అమ్మకాలు జరుపుతున్నట్లు తెలపడంతో, వారికి సహకరించే వారిపై ఆరా తీస్తున్నారు. లక్షల్లో ఆశ చూపి అడవి జంతువుల స్మగ్లింగ్  చేస్తున్నట్లు గుర్తించారు. అదుపులో ఉన్న వారిని విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏటీఆర్​ ఎఫ్​డీవో రామ్మూర్తి తెలిపారు.