మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు

కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామ శివారులో రైతు మన్నెమోని  వెంకటయ్య పొలంలో బుధవారం ఫారెస్ట్  ఆఫీసర్లు, సిబ్బంది మామిడి చెట్లను తొలగించారు. దీంతో వెంకటయ్య భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషయంపై ఎఫ్ఆర్వో శరత్ చంద్రారెడ్డిని వివరణ కోరగా.. వెంకటయ్య తీర్నాంపల్లి గ్రామ శివారులోని సర్వే నెం.55లోని ఫారెస్ట్  స్థలాన్ని చదును చేసి మామిడి మొక్కలు నాటినట్లు తెలిపారు. గత ఏడాది వెంకటయ్యకు నోటీసులు ఇచ్చినా చెట్లను తొలగించలేదని, దీంతో ఇటీవల నోటీసులు ఇచ్చి చిన్న మామిడి చెట్లను తొలగించామన్నారు. తన పొలం కంటే ఎక్కువ విస్తీర్ణంలో మామిడి మొక్కలు నాటినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు.