కరోనా టైంలోనూ విదేశీ పెట్టుబడులు ఆగలేదు

కరోనా టైంలోనూ విదేశీ పెట్టుబడులు ఆగలేదు
కరోనా ఉన్నా విదేశాల పెట్టుబడులు ఆగలేదు! వచ్చే ఏడాది ఇదే ట్రెండ్! కలిసొస్తున్న ప్రభుత్వం చర్యలు న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినప్పటికీ  ఈ ఏడాది  ఇండియాలోకి విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వెల్లువెత్తాయి. ప్రభుత్వ సంస్కరణలు కొనసాగుతుండడంతో  వచ్చే ఏడాది కూడా దేశంలోకి  ఫారిన్‌‌ డైరక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లు(ఎఫ్‌‌డీఐ), ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్ట్‌‌మెంట్ల(ఎఫ్‌‌పీఐ) ఇన్‌‌ఫ్లో బాగుంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు. కాగా,  కంపెనీలలోకి వచ్చే ఇన్వెస్ట్‌‌మెంట్లను ఎఫ్‌‌డీఐలని, స్టాక్‌‌ మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్ట్‌‌మెంట్లను ఎఫ్‌‌పీఐలని అంటారు.  దేశంలో వ్యాపార పరిస్థితులను మెరుగుపరిచేందుకు మోడీ ప్రభుత్వం వివిధ సంస్కరణలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా డిఫెన్స్‌‌ సెక్టార్లో ఎఫ్‌‌డీఐ  రూల్స్‌‌ను సరళీకరించింది. దీంతో వచ్చే ఏడాది ఢిపెన్స్ సెక్టార్లోకి విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు పెద్ద ఎత్తున వస్తాయని నిపుణులు అంచనావేశారు.  గ్లోబల్‌‌ ఎకానమీ స్లోడౌన్‌‌, కరోనా సంక్షోభం వంటివి ఉన్నప్పటికీ ఇండియాలోకి పెద్ద మొత్తంలో ఎఫ్‌‌డీఐలు వచ్చాయని డిపార్ట్‌‌మెంట్‌‌ ఫర్‌‌‌‌ ప్రమోషన్‌‌ ఆఫ్‌‌ ఇండస్ట్రీ అండ్‌‌ ఇంటర్నల్‌‌ ట్రేడ్‌‌(డీపీఐఐటీ) సెక్రటరీ గురుప్రసాద్‌‌ మహోపాత్ర అన్నారు. జియోలోకి ఫేస్‌‌బుక్‌‌ పెట్టిన ఇన్వెస్ట్‌‌మెంట్లతో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌‌‌‌ టైమ్‌‌లో ఇండియాలోకి 43.5 బిలియన్‌‌ డాలర్ల ఎఫ్‌‌డీఐలు వచ్చాయని చెప్పారు. ఈ ట్రెండ్ వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం లాక్‌‌డౌన్‌‌ను విధించింది.  దీంతో ఎకానమీ తీవ్రంగా నష్టపోయింది.  ఏప్రిల్‌‌–జూన్ క్వార్టర్లో దేశ జీడీపీ ఏకంగా మైనస్ 24 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఎకానమీ రికవరీ బాటలో ఉందని,  ఢిపెన్స్‌‌ సెక్టార్లో ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ సరళీకరించడంతో ఇన్వెస్టర్లు ఈ సెక్టార్‌‌‌‌ వైపు చూడొచ్చని మహోపాత్ర అన్నారు. దేశంలో ఈజ్‌‌ ఆఫ్ డూయింగ్‌‌ బిజినెస్‌‌ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వ్యాపారం చేసుకోవడానికి అడ్డంకిగా ఉన్న రూల్స్‌‌ను ప్రభుత్వం తొలగిస్తోందని అన్నారు. ఇప్పటికే చిన్న నేరాలకు గాను శిక్షలను తగ్గించిందని పేర్కొన్నారు. 20 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల ఎఫ్‌‌డీఐలు.. కోల్‌‌ మైనింగ్‌‌, కాంట్రాక్ట్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌, సింగిల్‌‌ బ్రాండ్‌‌ రిటైల్‌‌ ట్రేడింగ్‌‌ వంటి సెక్టార్లలో ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను ప్రభుత్వం సరళీకరించింది. యానిమేషన్‌‌, విజువల్‌‌ ఎఫెక్ట్స్‌‌, గేమింగ్‌‌, కామిక్స్‌‌ వంటి విభాగాలలో కూడా రూల్స్‌‌ను సులభతరం చేయాలని డీపీఐఐటీ చూస్తోంది. 2000, ఏప్రిల్‌‌ నుంచి 2020 సెప్టెంబర్‌‌‌‌ మధ్యలో ఇండియాలోకి 500 బిలియన్‌‌ డాలర్ల విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వచ్చాయని ప్రభుత్వ డేటా చెబుతోంది. ఈ 20 ఏళ్లలో విదేశీ పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా ఇండియా మారిందని పేర్కొంది.  ఈ ఎఫ్‌‌డీఐలలో  మెజార్టీ వాటా మారిషస్(29 శాతం) నుంచి వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత సింగపూర్‌‌‌‌(21 శాతం), అమెరికా, నెదర్లాండ్‌‌, జపాన్‌‌(7 శాతం చొప్పున), ఇంగ్లండ్‌‌(6 శాతం) ల నుంచి ఎక్కువగా విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు దేశంలోకి వచ్చాయి. జర్మనీ, సిప్రస్‌‌, ఫ్రాన్స్‌‌, కైమన్‌‌ ఐలాండ్స్‌‌ నుంచి కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. 2015–16 నుంచి దేశంలోకి ఎఫ్‌‌డీఐల ఇన్‌‌ఫ్లోస్‌‌ ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్‌‌ డాలర్ల విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు రాగా, ఇది 2014–15 లో వచ్చిన ఎఫ్‌‌డీఐల కంటే 35 శాతం ఎక్కువ. 2016–17 లో 43.5 బిలియన్ డాలర్లు, 2017–18 లో 44.85 బిలియన్‌‌ డాలర్లు, 2018–19 లో 44.37 బిలియన్ డాలర్లు, 2019–20 లో 50 బిలియన్‌‌ డాలర్ల విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వచ్చాయి. సర్వీస్‌‌ సెక్టార్‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌, హార్డ్‌‌వేర్‌‌‌‌, టెలికమ్యూనికేషన్స్‌‌, ట్రేడింగ్‌‌, కన్‌‌స్ట్రక్షన్‌‌, డెవలప్‌‌మెంట్‌‌, ఆటోమొబైల్‌‌, కెమికల్స్‌‌, ఫార్మాస్యూటికల్స్‌‌ సెక్టార్లలోకి ఎఫ్‌‌డీఐలు ఎక్కువగా వచ్చాయి. టెలికాం, మీడియా, ఫార్మా, ఇన్సూరెన్స్‌‌ సెక్టార్లు మినహా మిగిలిన సెక్టార్లలోకి ఆటోమెటిక్ రూట్‌‌లో ఎఫ్‌‌డీఐలకు అనుమతి  ఉంది.ఈ సెక్టార్లలో ఇన్వెస్ట్‌‌ చేయాలంటే సంబంధిత మినిస్ట్రీ నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఆటోమెటిక్ రూట్‌‌లో అయితే ఇన్వెస్ట్‌‌మెంట్ చేశాక రిజర్వ్‌‌ బ్యాంక్‌‌కు  తెలపాలి. లాటరీ బిజినెస్‌‌, గ్యాంబ్లింగ్‌‌, బెట్టింగ్‌‌, చిట్‌‌ ఫండ్స్‌‌, నిధి కంపెనీ, రియల్‌‌ ఎస్టేట్‌‌ బిజినెస్‌‌, సిగరెట్ల తయారీ వంటి ఏరియాలలో ఎఫ్‌‌డీఐలకు అనుమతి లేదు. For More News.. కొత్త వ్యవస్థ వస్తేనే రైతు కష్టం తీరుతది లాక్‌డౌన్‌లో పానీ పూరికి 2 లక్షల ఆన్‌లైన్‌ ఆర్డర్లు అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో