వరుసగా 6వ సారి.. ఫోర్బ్స్​ జాబితాలో నిర్మలా సీతారామన్..

2024కుగాను ఫోర్బ్స్​ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వరుసగా ఆరోసారి చోటు దక్కించుకున్నారు. 

మొదటి స్థానంలో యూరోపియన్​ కమిషన్​ చీఫ్​ ఉర్సులా వాన్​ దెర్​ లెయెన్​, రెండో స్థానంలో యూరోపియన్​ సెంట్రల్​ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా నిలిచారు. ఈ జాబితాలో భారత్​ నుంచి ముగ్గురికి చోటుదక్కింది. 28 స్థానంలో నిర్మలా సీతారామన్ 81వ స్థానంలో హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​ చైర్​పర్సన్​, హెచ్​సీఎల్​ కార్పొరేషన్ సీఈవో రోష్ని నాడార్​, 82వ స్థానంలో బయోకాన్ లిమిటెడ్​ చైర్​పర్సన్​ కిరణ్​ మజుందార్​ షా నిలిచారు. 

ఫోర్బ్స్​ జాబితాలో నిర్మలా సీతారామన్​ 2009లో 34, 2020లో 41, 2021లో 37, 2022లో 36, 2023లో 32, 2024లో 28వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్​ ప్రతి ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయం, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రతిభావంతమైన వ్యక్తుల ర్యాంకింగ్​లను విడుదల చేస్తుంది.