ఎస్సీల స్కాలర్ షిప్ పథకానికి కేబినెట్ ఆమోదం

ఎస్సీల స్కాలర్ షిప్ పథకానికి కేబినెట్ ఆమోదం
SC విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల కోసం 59 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో ఐదేళ్ల పాటు SC విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వనున్నారు. దీని ద్వారా దాదాపు 4 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందని కేంద్రం చెప్పింది. పదో తరగతితోనే చదువు ఆపేస్తున్న కోటి 36 లక్షల మంది స్టూడెంట్స్.. ఉన్నత చదవులు కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని కేంద్రమంత్రులు చెప్పారు. ఇక.. స్కాలర్ షిప్ ఇవ్వడం వల్ల.. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన స్టూడెంట్స్ విద్యా అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు ప్రధాని మోడీ. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు DTH లైసెన్సింగ్ విధానంలో మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.