జూబ్లీహిల్స్​లో ఫుడ్​ సేప్టీ అధికారుల తనిఖీలు

జూబ్లీహిల్స్​,వెలుగు : ఫుడ్​ సేప్టీ అధికారులు జూబ్లీహిల్స్​లోని పలు పబ్​లు, రెస్టారెంట్లపై ఆదివారం దాడులు నిర్వహించారు.   రోడ్డు నంబరు 45లోని  డైలీ రిచువల్స్​, హార్ట్​ కప్​ కాఫీ రెస్టారెంట్​లో తనిఖీలు  చేశారు.  కిచెన్​లో   బొద్దింకలు , కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను గుర్తించారు.  

ఫ్రిజ్​లు శుభ్రం చేయక పోవడం,  6 కిలోల టమాటో పేస్ట్ ,10 కిలోల వనస్పతి, బంగాళా దుంపలు, కూరగాయలు పాడై పోయినట్టు అధికారులు గుర్తించారు.  దీంతో  హోటళ్లపై  అధికారులు కేసులు  నమోదు చేశారు.