మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ..హోటల్, బేకరీల్లో తనిఖీలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్నగర్ మున్సిపాలిటీ కమిషనర్. ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం జిల్లా కేంద్రంలోని హోటల్స్, బేకరీల్లో తనిఖీలు చేశారు. పట్టణంలోని మోడ్రన్ బేకరీకి రూ.5 వేల జరిమానా విధించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఖాద్రి హోటల్ కు రూ.3 వేలు, నాయబ్ హోటల్ కు రూ.3 వేలు ఫైన్ వేశారు. సింధు హోటల్ లో కుళ్లిన పదార్థాలను గుర్తించిన అధికారులు కలెక్టర్ కు రిపోర్ట్ అందించారు.

మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్స్ రూ.11వేల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి మనోజ్ కుమార్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.