మెహిఫిల్, దర్బార్ రెస్టారెంట్ల పరిస్థితి కూడా అంతేనా.. ఈ ఫుడ్ తింటే ఇంకేమన్నా ఉందా..!

అసలే చలికాలం.. ఎప్పటికప్పుడు వేడి వేడిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అందులో చలికి నాన్ వెజ్ టచ్ ఉంటే ఆ మజానే వేరు. అందుకోసం బెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందా అంటే.. బిర్యానీ ప్రిఫర్ చేస్తారు ఎవరైనా. మరి బిర్యానీ కావాలంటే మనకు గుర్తొ్చ్చే రెస్టారెంట్లలో మెహిఫిల్, దర్బార్, అరేబియన్ మండి కదా. ఎంత దూరంలో ఉన్నా ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వార్త చదివాక చివరికి మెహిఫిల్ లో కూడా పరిస్థితి ఇంతేనా అని అనుకోక తప్పదు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య స్పీడ్ పెంచారు. ఆకస్మిక తనిఖీలతో హోటల్స్, రెస్టారెంట్లలో పరిస్థితులను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని నారాయణగూడ రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. నారాయణగూడ మెహిఫిల్, బిర్యాని దర్బార్, కాచిగూడలోని ముబారక్ అరేబియన్ మండి హౌజ్ లలో  ఫుడ్ సేఫ్టీ తనిఖీ చేపట్టారు. రెస్టారెంట్లలోని పరిసరాలు పరిశీలించిన అధికారులు నిబంధనలు పాటించట్లేదని అన్నారు. 

నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు గుర్తించారు. అదే విధంగా కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. కిచెన్ లో బొద్ధింకలు ఉన్నట్టు గుర్తించారు. కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నట్లు నిర్ధారించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఆ తర్వాతి రోజు  సర్వ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

హైద్రాబాద్ వాసులు ఎంతో ఇష్టంగా తినే బిర్యానీకి వన్ ఆఫ్ ద బ్రాండ్ అనుకునే మెహిఫిల్ లాంటి రెస్టారెంట్ల పరిస్థితి కూడా ఇలా ఉంటే ఇక ఎక్కడ తినాలో అర్థం కాని పరిస్థితి. చూడటానికి బయటికి ఎంత కలర్ ఫుల్ గా, లైంటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నా.. లోపల ఉండే పరిస్థితి వేరని అధికారుల రైడింగ్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక నుంచి ఏదైనా రెస్టారెంట్ లో తినాలన్నా.. ఆర్డర్ చెయ్యాలన్నా ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే.. ఎంచక్కా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని లాగించేస్తే అంతకు మించిన ఆరోగ్యం ఉంటుందా.