
జీడిమెట్ల, వెలుగు: కొంపల్లిలోని రెస్టారెంట్లలో ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మల్నాడు, ఉలవచారు, ట్రెయిన్ థీమ్ రెస్టారెంట్లలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. డైనింగ్ఏరియాతోపాటు కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, కుల్లిన కూరగాయలను స్టోర్చేస్తున్నారని, ఆహార వ్యర్థాలను ఇష్టానుసారం పడేస్తున్నారని ఫుడ్సేఫ్టీ అధికారులు తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్లలోనే మాంసం, ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేస్తునట్లు గుర్తించామన్నారు. ఫుడ్ఐటమ్స్తయారీలో హానికర సింథటిక్కలర్స్ వాడుతున్నారన్నారు.