Food poisoning: మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్..33మంది విద్యార్థులకు అస్వస్థత

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నాగారం మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయింది. 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం (డిసెంబర్ 19) మధ్యాహ్నం  భోజనం తిన్నాక.. విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు.  

వెంటనే విద్యార్థులను చికిత్స కోసం ఘట్ కేసర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు గురుకుల విద్యాలయ సిబ్బంది. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | అరె ఆగండ్రా బయ్.. నేను రోడ్డు దాటాలె.. హన్మకొండ జిల్లాలో కొండ చిలువ చేసిన పని ఇది..!

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ గురుకులంలో మొత్తం 450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే గురువారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. 

దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం టిఫిన్ లో బొండాలు తిన్నారని.. ఫుడ్ డైజెస్ట్ కాకపోవడంతో ఇలా వాంతులు చేసుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. డాక్టర్లు కూడా బొండాలు డైజెస్ట్ కాకపోవడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని.. వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.