- వాడిన నూనె నిల్వ ఉంచి వంటలు చేయడమే కారణం
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్‍స్టేషన్ పరిధిలో ఉన్న సీఆర్‍పీఎఫ్ బేస్‍క్యాంపులో 28 మంది జవాన్లకు శుక్రవారం ఫుడ్పాయిజన్అయ్యింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని స్థానిక సీఆర్‍పీఎఫ్ ఫీల్డ్దవాఖానాలో చేర్చి ట్రీట్మెంట్ అందించారు. ఇందులో 12 మందికి ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. 150వ బెటాలియన్ 'సీ' కంపెనీకి చెందిన వీరంతా.. వాడిన నూనెను నిల్వ ఉంచి మళ్లీ ఆహారం తయారు చేసుకుని తినడంతోనే ఫుడ్‍పాయిజన్ అయ్యిందని క్యాంపు కమాండెంట్ రాజేశ్‍యాదవ్ తెలియజేశారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రమాదం లేదని, అందరూ బాగానే ఉన్నారన్నారు.
