నినాదాల మధ్య బడ్జెట్ స్పీచ్.. ఇది కఠినమైన బడ్జెట్

నినాదాల మధ్య  బడ్జెట్ స్పీచ్.. ఇది కఠినమైన బడ్జెట్

2021-22 బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొదటిసారి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. లోక్ సభ ప్రారంభమవ్వగానే విపక్షాలు నినాదాలు చేశాయి . స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా వద్దని వారించినా వారు వినలేదు. నినాదాల మధ్యనే నిర్మలాసీతారామన్ బడ్జెట్ స్పీచ్ మొదలు పెట్టారు. నెవర్ బిఫోర్ పరిస్థితుల్లో బడ్జెట్ పెడుతున్నామన్నారు. 2020-21 టైమ్ లో ఎకానమీ బాగాలేదన్నారు. ఎకనామీ రికవరీ ప్యాకేజీ ప్రకటించామన్నారు. రూ. 27లక్షల కోట్లకు పైగా ప్యాకేజీలు ప్రవేశపెట్టామన్నారు.  దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయన్నారు. 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేశామన్నారు. 2021లోనూ కరోనాపై పోరాటం కొనసాగుతుందన్నారు. భారత్ లోనే అతి తక్కువ కరోనా డెత్ రేటన్నారు. ఇది చాలా కఠినమైన బడ్జెట్ అని అన్నారు. ఎకానమీ రీసెట్ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దేశ చరిత్రలో 2021లో ఇంపార్టెంట్ ఇయర్ అని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, గుడ్ గవర్నెన్స్ అన్నారు. అందరికీ విద్య, మహిళా సాధికారత అన్నారు.