- ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
బెంగళూరు: ప్రభుత్వ కంపెనీల పనితీరును మరింత పెంచేందుకు, ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించేందుకే డిజిన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ కంపెనీల్లోకి ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించడం ద్వారా వాటిని మూసేయకుండా కొనసాగించగలుగుతామని చెప్పారు. 1994 నుంచి 2004 మధ్య ప్రైవేటైజ్ అయిన ప్రభుత్వ కంపెనీల పనితీరు బాగా మెరుగుపడిందని, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ వీటిని నడుపుతున్నాయని వివరించారు. ప్రభుత్వం తెచ్చిన పీఎస్‌ఈ పాలసీ వలన అన్ని సెక్టార్లలోని ప్రభుత్వ కంపెనీల్లోకి ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షిస్తున్నామని అన్నారు. స్పేస్, నూక్లియర్ ఎనర్జీ సెక్టార్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు.
