గాల్లో ఎగిరే కారు.. నిమిషంలో టేకాఫ్, ల్యాండింగ్..

గాల్లో ఎగిరే కారు.. నిమిషంలో టేకాఫ్, ల్యాండింగ్..

కారులో గంటకు 100 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తే.. గాల్లో తేలినట్లుంటది.. మరి గాల్లోనే 100 కిలోమీటర్ల స్పీడులో వెళ్తే.. ఇగో ఈ ‘ఎయిర్​కార్’ లెక్క ఉంటది. ఇటు రోడ్డుపై రయ్ అంటది.. అటు గాలిలో దూసుకెళ్తదీ ‘హైబ్రీడ్’. 10 వేల అడుగుల ఎత్తులో కూడా 160 కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంది. చైనాకు చెందిన టెర్రాఫుజియా ట్రాన్సిషన్ సంస్థ తయారు చేసిన ఈ కారుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అప్రూవల్ ఇచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 నాటికల్లా ఈ ఎయిర్–రోడ్డు హైబ్రీడ్ కారు గగన వీధిలో దూసుకుపోనుంది.

నిమిషంలో టేకాఫ్.. ల్యాండింగ్..

చిన్న ఎయిర్​పోర్టులు, హైవేల్లో ‘హైబ్రీడ్’ ల్యాండింగ్, టేకాఫ్​కు ఒక నిమిషం టైంలోనే ఫ్లయింగ్ మోడ్ నుంచి డ్రైవింగ్ మోడ్​లోకి డ్రైవర్లు మారొచ్చు. రెండు సీట్లు ఉండే హైబ్రీడ్ కారు నడపాలంటే అటు డ్రైవింగ్ లైసెన్స్, ఇటు స్పోర్ట్ పైలట్ సర్టిఫికెట్ కంపల్సరీ. ప్రస్తుతానికి పైలట్లు, ఫ్లైట్ స్కూళ్లకు ఈ ఎయిర్​కారును అందుబాటులో ఉంచారు.

ఇట్లుంటది

  •     100 హెచ్​పీ రోట్యాక్స్ 912ఐఎస్ స్పోర్ట్ ఫ్యూయల్ ఇన్జెక్టెడ్ ఇంజిన్​తో నడుస్తది.. బరువు సుమారు 600 కిలోలు
  •     ప్రీమియం గ్యాస్ లేదా ఎయిర్​ప్లేన్ ఫ్యుయల్​తో నడుస్తుంది.
  •     నాలుగు టైర్లకు హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు ఏర్పాటు చేశారు.
  •     ప్యారాచ్యూట్స్ అందుబాటులో ఉంచుతారు.
  •     సింగిల్ కార్ గ్యారేజ్​లో ఉంచేందుకు రెక్కలను పైకి ఫోల్డ్ చేయొచ్చు.