హైదరాబాద్, వెలుగు: రీజినల్ ఎయిర్‌లైన్ కంపెనీ ఫ్లైబిగ్ హైదరాబాద్‌లో కూడా తన సర్వీస్‌లను స్టార్ట్ చేసింది. ఉడాన్ రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) కింద సర్వీస్‌లను అందిస్తున్న ఈ సంస్థ, హైదరాబాద్, ఇండోర్ (మధ్యప్రదేశ్), గోండియా (మహారాష్ట్ర) సిటీలకు తన సర్వీస్‌లను విస్తరించింది. దీంతో దేశం మొత్తం మీద కంపెనీ ఆపరేట్ చేస్తున్న సిటీలు 11 కి పెరిగాయి. ఈ నెల 13 న ఇండోర్–గోండియా–హైదరాబాద్ ఫ్లయిట్ సర్వీస్‌లను కంపెనీ ప్రారంభిస్తుంది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరిన్ని సిటీలకు విస్తరించడంలో భాగంగా కొత్త రూట్లను లాంచ్ చేశామని ఫ్లైబిగ్ చైర్మన్ అండ్ ఎండీ సంజయ్ మాండవీయా అన్నారు. ఈ రీజినల్ కంపెనీ 2021 మే లో తమ సర్వీస్‌లను లాంచ్ చేసింది. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో సర్వీస్‌లను అందిస్తున్న ఫ్లైబిగ్, ఎనిమిది డెస్టినేషన్లకు ప్యాసెంజర్లను చేరవేస్తోంది. కోల్‌కతా (వెస్ట్ బెంగాల్), దిబ్రుగర్, గౌహతి, లిలాబారి, రుప్సి (అస్సాం), అగర్తలా (త్రిపుర), పాసిఘట్, తెజు (అరుణాచల్ ప్రదేశ్) డెస్టినేషన్లకు ఫ్లైబిగ్ సర్వీస్‌లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ వద్ద ఏటీఆర్ 72–500, ఏటీఆర్ 72–600 విమానాలు ఉన్నాయి.
