నాగార్జునసాగర్​ డ్యాంకు వరదపోటు 

  • సాగర్​కు తగ్గని వరద
  • 2 లక్షలకుపైగా క్యూసెక్కుల ఇన్​ఫ్లో  

హాలియా, వెలుగు : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్​ కు  శ్రీశైలం నుంచి 2,02,420 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో సాగర్ ప్రాజెక్ట్​అధికారులు 20 క్రస్ట్ గేట్లు ఎత్తి 2,02,404 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 590 అడుగుల(312.50 టీఎంసీలు)కు 589 అడుగులు(309.0570 టీఎంసీలు) గా ఉంది. ఇందులో కుడి కాల్వ ద్వారా 9,047 , ఎడమ కాల్వ ద్వారా 6,173 , విద్యుత్​ ఉత్పత్తికి 25,100, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 , వరదకాల్వకు 400 క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేస్తున్నారు. 

సింగూరుకు 12 వేల క్యూసెక్కులు

పుల్కల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు  సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్ కు 12, 000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.  ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోవడంతో సోమవారం 6వ గేట్ ను 2  మీటర్లు పైకి ఎత్తి 10, 746 క్యూసెక్కులు దిగువకు  వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 2725 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 29.827 టీఎంసీలు నిల్వ ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, గొర్ల  కాపరులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు నది లోకి