విమానాలను ల్యాండ్ చేయాలంటే చివరకు అత్యవసరంగా దించాలన్నా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిందే.. కానీ, కొన్ని పరిస్థితుల్లో జాతీయ రహదారులపై దించేసే ఎలా ఉంటుంది...? విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. గత ఏడాది మేదరమెట్ల వద్ద రన్ వే పై నాలుగు కార్గో విమానాలు, ఒక జెట్ విమానంతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రన్ వే పై దిగకుండా 100 మీటర్ల ఎత్తులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
దీనికి సంబంధించి ఇవ్వాళ ఏపిలో ట్రయల్ రన్ నిర్వహించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు.. హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ను కొరిశపాడు – రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై నిర్వహించారు. ఈ హైవే రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ను దారి మల్లించారు. అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దించే విధంగా.. దేశవ్యాప్తంగా 13 రన్‌వేల కోసం జాతీయ రహదారులను సిద్ధం చేస్తున్నారు..
వీటికోసం.. హైవే అథారిటీ ఒక్కొక్క రన్ వే కోసం 79 కోట్ల రూపాయలతో 4.1 కిలోమీటర్ల పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించింది.. ఇవ్వాళ హైవేపై విమానాలను ఏయిర్ ఫోర్స్ అధికారులు విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ నిర్వహించారు .. ఈ సందర్భంగా హైవే పై వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దారి మళ్లించి.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీసులు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ రహదారులపైనే విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్ చేసే విధంగా ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి..