యూకే-ఇండియా విమానాలపై నిషేదం ఎత్తివేత

యూకే-ఇండియా విమానాలపై నిషేదం ఎత్తివేత
యూకే , ఇండియాల మధ్య విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 8 నుంచి యూకే ఇండియా మధ్య విమాన సర్వీసులు స్టార్ట్ అవుతాయి. జనవరి 23 వరకు వారానికి 15 విమానాల సర్వీసులకు  మాత్రమే అనుమతిచ్చారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నుండి మాత్రమే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులుంటాయని ట్విట్టర్ లో  కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి తెలిపారు. బ్రిటన్ లో నూతన వేరియంట్ కరోనా కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 23వ తేదీ నుంచి  యూకే-ఇండియా మధ్య విమానా రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. సర్కార్ కు కిక్కే కిక్కు.. డిసెంబర్ లో రికార్డ్ సేల్స్