NHRC చీఫ్ ఎంపిక లోపభూయిష్టం: మల్లికార్జున్ ఖర్గే

NHRC చైర్ పర్సన్, సభ్యుల ఎంపిక లోపభూయిష్టంగా ఉంది. ఏకపక్షంగా ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్, కమిషన్ సభ్యులను ఎంపిక చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిక్ష పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కమిషన్ చైర్మన్, సభ్యులను ఎన్నుకోవడాన్ని తప్పుబట్టారు. 

మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్,ప్రియాంక్ కానూంగో, డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యులుగా నియమానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనిపై ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు.  

NHRC చైర్ ఫర్సన్ పదివికి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమాన్, జస్టిస్ కుట్టియిల్ మాథ్యూ జోసెఫ్ పేర్లను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు. అదేవిధంగా NHRC సభ్యుల స్థానానికి జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ అకిల్ అబ్దుల్ హమీద్ ఖురేషీల పేర్లను సిఫార్సు చేశారు. ఈ ఇద్దరు మానవ హక్కులను సమర్థించడంలో మంచి ట్రాక్ ఉందని  అన్నారు. 

ALSO READ | మన జీవితాలు ఎప్పుడూ ఏడుపే.. మన కంటే పాకిస్తాన్ వాళ్లే హ్యాపీ అంట..!

కులం, మతం, ప్రాంతం వంటి అంశాల్లో సమన్యాయం దృష్టిలో పెట్టుకోలేదని  కాంగ్రెస్  నేతలు అన్నారు. ఇటువంటి విధానం ప్రభుత్వ వివక్షను చూపుతుందని ఆరోపించారు. వారి చేరిక NHRC యొక్క ప్రభావానికి మరియు వైవిధ్యానికి దాని నిబద్ధతకు దోహదపడుతుంది" అని అసమ్మతి నోట్ పేర్కొంది. 

జస్టిస్(రిటైర్డ్) రామసుబ్రమణియన్ నియామకానికి ముందు జూన్1న జస్టిస్(రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తయినప్పటి నుంచి NHRC చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది.మిశ్రా పదవీ విరమణ తర్వాత విజయ భారతి సయానీ మానవ హక్కుల ప్యానెల్‌కు తాత్కాలిక చైర్‌పర్సన్ నియమించారు. 

డిసెంబర్ 18న NHRC తదుపరి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. గాంధీ, ఖర్గే సమావేశానికి హాజరయ్యారు.NHRC చీఫ్‌ను ఎంపిక చేసే కమిటీకి ప్రధాని నేతృత్వం వహిస్తుంచగా లోక్‌సభ స్పీకర్, హోంమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, డిప్యూటీ చైర్‌పర్సన్ , రాజ్యసభ సభ్యులు సభ్యులుగా ఉంటారు.