కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు

కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు

తమిళనాడులోని తెన్ కాసీ జిల్లాలోని పాత కుర్తాళం జలపాతం వద్ద శుక్రవారం (మే 17) న ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వరద ఉధృతం గా రావడంతో 16 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. బాలుడు తిరునెల్వేలికి చెందిన  అశ్విన్ గా గుర్తించారు. భారీ వర్షం కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. కుర్తాళం జలపాతం ఆకస్మిక జలపాతం  వరదకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఒక్కసారిగా  వరదనీరు పెద్దఎత్తున రావడంతో జలపాలంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈ వరదలో అశ్విన్ (16) కొట్టుపోయాడు. అశ్విన్ కోసం సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుర్తాళం జలపాతంలో స్నానాలను నిషేధించారు.  శనివారం (మే 18) న తెన్ కాసీ , తేని, దిండిగల్ లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది.