కోస్గిలో ఫ్లాగ్​మార్చ్

కోస్గి, వెలుగు: ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్​మార్చ్​ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ గౌడ్  తెలిపారు. వచ్చే పార్లమెంట్  ఎన్నికల సందర్భంగా ప్రజల్లో భరోసా కల్పించేందుకు బుధవారం సమస్యాత్మక ప్రాంతాలైన హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సెకండ్​ ఎస్ఐ -నరేశ్, బుగ్గప్ప, రాజేందర్​రెడ్డి, రామకృష్ణ, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.