సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్​మార్చ్

మద్దూర్, వెలుగు: పార్లమెంట్  ఎన్నికల సందర్భంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన రేణివట్ల, చెన్నారెడ్డిపల్లిలో శనివారం కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులతో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాంలాల్  మాట్లాడుతూ పార్లమెంట్  ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.