జాతీయ జెండాలను ఇవ్వండి.. జాగ్రత్తగా భద్ర పరుస్తామని ఇండియన్ ఆయిల్ కంపెనీ (Indian Oil Company) వెల్లడించింది. జెండాల పరిరక్షణకు ఆ కంపెనీ నడుం బిగించింది. అందులో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఉపయోగించిన జాతీయ జెండాలను రోడ్ల మీద పడేయవద్దని ముంబాయి వాసులకు సూచించింది. సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కంపెనీలకు ఇవ్వాలని సూచించింది. బాగున్న వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తామని, చిరిగిన వాటిని డిస్పోజ్ చేస్తామని తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ చేసిన ప్రకటనను ఎంతోమంది స్వాగతిస్తున్నారు.
దేశ మంతా 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు, మూడు వారాల పాటు కొనసాగాయి. దేశ వ్యాప్తంగా ఈ నెల 02వ తేదీ నుంచే సంబరాలు ప్రారంభమయ్యాయి. 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పడంతో జాతీయ జెండాలు భారీ సంఖ్యలో రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. జీహెచ్ఎంసీ అధికారులు భారీ సంఖ్యలో జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణీ చేసింది. ఆగస్టు 15వ తేదీ అయిపోయిన అనంతరం జాతీయ జెండాలను కొంతమంది జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. జాతీయ జెండాల పరిరక్షణకు కంపెనీలు ముందుకు రావడం శుభపరిణామమంటున్నారు.
Tricolour after 15th August
— PatilCharchil (@CharchillPatil) August 16, 2022
FLAG COLLECTION DRIVE
TREAT NATIONAL FLAG WITH DIGNITY
Handover the Flags which are no longer in use to the nearest Indian Oil Petrol Pumps.
We will preserve the good ones and dispose the damaged ones with respect. pic.twitter.com/uce2uCDVUh
