ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ కు ఐపీఎల్ 2025 మెగా వేలంలో మరోసారి భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తుంది. 2023 ఐపీఎల్ మినీ వేలంలో ఈ యువ ఆసీస్ బౌలర్ ను గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లీగ్ ల్లో అద్భుతంగా ఆడుతున్న అతనికి ఈ ధర లభించింది. అయితే స్పెన్సర్ జాన్సన్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శన చేయడంతో అతన్ని గుజరాత్ టైటాన్స్ 2025 ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది.
మరో వారం రోజుల్లో మెగా ఆక్షన్ జరగనుండడంతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఐపీఎల్ లో తాను కోట్ల రూపాయలు కొల్ల గొట్టడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాకిస్థాన్ తో ముగిసిన రెండో టీ20లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లలో 26 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. తీసిన 5 వికెట్లలో మహ్మద్ రిజ్వాన్,సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ ఖాన్,అఘా సల్మాన్,అబ్బాస్ అఫ్రిది లాంటి టాప్ ప్లేయర్లు ఉండడం విశేషం. ఈ ప్రదర్శనతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచాడు జాన్సెన్. మినీ వేలంలో రూ. 10 కోట్లు కొల్లగొట్టిన ఈ ఆసీస్ యువ పేసర్ మెగా ఆక్షన్ లో ఎంత ధర పలుకుతుందో చూడాలి.
ALSO READ | AUS vs PAK: రెండో టీ20 ఆసీస్‌దే.. రిజ్వాన్ జిడ్డు బ్యాటింగ్‌తో ఓడిన పాకిస్థాన్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. షార్ట్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. హారిస్ రూప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖాన్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 5 వికెట్లు పడగొట్టిన జాన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
After getting the crucial wicket of Usman Khan, Spencer Johnson bags another in the over to bring up his five-for ??
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
Live: https://t.co/LA5xJrxsV2 | #AUSvPAK pic.twitter.com/yJd7EUyNKH