పుణెలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు మృతిచెందారు. చనిపోయిన వారంతా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వారు. 

నారాయణఖేడ్, వెలుగు: మహారాష్ట్రలోని పుణెలో జరి గిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన రఫిక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నారాయణఖేడ్ నుంచి పుణెకు కారులో బయలుదేరారు. 

తిరుగు ప్రయాణంలో మంగళవారం సాయంత్రం పుణె శివారులోకి రాగానే వారు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రఫిక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ ఘట నా స్థలిలోనే మృతి చెందారు. సయ్యద్ అమర్  తీవ్రంగా గాయపడ్డాడు. డెడ్ బాడీలను పుణె ఆసుపత్రికి తరలించారు. సయ్యద్ అమర్​కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.