కర్నాటక చిత్రదుర్గ జిల్లాలోని బిజిహల్లి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు క్రూయిజర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయ్ చుర్ జిల్లాలోని లింగసూగర్ నుంచి బెంగళూరుకు వస్తున్న క్రూయిజర్ వాహనాన్ని బిజిహిల్లి దగ్గరకు రాగానే రాయ్ చుర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో క్రూయిజర్ లోని ఐదుగురు మృతి చెందారు. ఘటన స్థలానికి వచ్చిన చిత్రదుర్గ పోలీసులు గాయాలైన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆస్పత్రికి పంపారు. మృతుల వివరాలు ఇంకా తెలవాల్సి ఉంది.
వలపు వల విసిరి..ఆ తర్వాత రంగంలోకి…
Karnataka: Five people were killed and six others injured in a road accident near BG Halli in Chitradurga district last night, say Chitradurga Police pic.twitter.com/9WeIZ625qk
— ANI (@ANI) December 27, 2020
