మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ నగరంలోని రావెట్ కివ్లే ప్రాంతంలో ఇనుప హోర్డింగ్ బోర్డు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. ఇందులో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలేంటని ఆరాదీస్తున్నారు.
