బీజేపీలోకి మరో అయిదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

బీజేపీలోకి మరో అయిదుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు

కోల్‌కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీలోని అయిదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్, సువేందు అధికారి సమక్షంలో టీఎంసీ ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్ సర్దార్, దీపేందు బిశ్వాస్, రబీంద్రనాథ్ భట్టాచార్య, జత్తు లాహిరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున టికెట్ కేటాయించకపోవడంతోనే వీరంతా బీజేపీలో చేరారు. టీఎంసీ చీఫ్ మమతకు సన్నిహితురాలిగా ఉండే ఎమ్మెల్యే సోనాలికి ఈ ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. 80 ఏండ్లు దాటిన కారణంగా సీనియర్ లీడర్, సింగూర్ ఎమ్మెల్యే రబీంద్రనాథ్ భట్టాచార్యకు, షిబ్పూర్ ఎమ్మెల్యే జత్తు లాహిరికి టిక్కెట్లు దక్కలేదు. ఇక, టీఎంసీ మాజీ లీడర్ సరళ ముర్ము కూడా బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో హబీబ్పూర్ నియోజకవర్గ టీఎంసీ టిక్కెట్ను ప్రదీప్ భాస్కర్కు ఆ పార్టీ ప్రకటించిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.