కాల్ మనీ వేధింపుల కేసులో మరో ఐదుగురి అరెస్ట్

కాల్ మనీ వేధింపుల కేసులో మరో ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్: కాల్ మనీ వేధింపుల కేసులో మరో ఐదుగురిని ఢిల్లీలో అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తీసుకొచ్చామని తెలిపారు సైబర్ క్రైమ్ పోలీసులు. పక్కా సమాచారంతో ఢిల్లీలో ఐదుగురుని అరెస్ట్ చేసి, హైదరాబద్ సీసీఎస్ కి తరలించామన్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా  కాల్ సెంటర్ ద్వారా లోన్ తీసుకున్నవారిని వేదిస్తున్న ఐదుగురిని గుర్తించామన్నారు. మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు పోలీసులు.