లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన నలుగురు ఏరియా కమిటీ సభ్యులతో పాటు ఓ దళ సభ్యుడు లొంగిపోయారని ఎస్పీ బి.రోహిత్‌‌‌‌ రాజ్‌‌‌‌ చెప్పారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రానికి చెందిన పూనెం పాక్లి, రవ్వ సోమ, మడివి మంగితో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన వెట్టి దేవ అలియాస్​బాలు, మడకం ఉంది అలియాస్​గంగి శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పాక్లి నాలుగేండ్లుగా మావోయిస్ట్‌‌‌‌ పార్టీలో పనిచేస్తున్నారని ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వారంతా పలు విధ్వంసక ఘటనల్లో పాల్గొన్నారన్నారు.