అరటిపండు తింటే కలిగే..5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటుంటారు..ఆరోగ్యం లేకుంటే ఏదీ ముందుకు సాగదు..అలాంటి ఆరోగ్యం కోసం మనం పొద్దున లేచినప్పటినుంచి పడుకొనే వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. అయితే అందరికి ఏ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి తోడ్పడుతుంది.. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.. అనే విషయాలపై అవగాహన లేకపోవచ్చు. అలాంటి వారికోసం మనం తీసుకునే ఆహారం.. ప్రయోజనాలపై కొంత అవగాహన కోసం..

అరటిపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటుంటారు.. మరీ ఆరటిపండులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అరటిపండు తింటే లభించే పోషకాలు ఏమిటో తెలుసుకుందాం.. 

రోజూవారి ఆహారంలో అరటిపండు చేర్చడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం జీవించేందుకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్, జీర్ణం అయ్యే ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది.

అరటిపండులో B6 విటమిన్ పుష్కలం

అరటిపండులో B6 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి ఈజీగా శోషణం చెందుతుంది. ఒక అరటిపండు మనకు రోజువారీ అవసరాలకు కావాల్సిన 25 శాతం  B6ను అందిస్తుంది. 

C విటమిన్ 

అరటిపండు నుంచి డైరెక్టుగా C విటమిన్ అందకపోయినప్పటికీ..ఇది మన రోజూవారీ అవసరాలకు కావాల్సిన 10 శాతం C విటమిన్ ఉత్పత్తి చేయడం సాయ పడు తుంది. 

మాంగనీస్..

ఒక్క అరటిపండు మనకు రోజు కావాల్సిన మాంగటనీస్ ఖనిజాలను దాదాపు 13 శాతం అందిస్తుంది. ఇది కోల్లాజెన్ ఉత్పత్తి, ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించ డంలో సాయపడుతుంది. 

పొటాషియం 

పొటాషియం.. మీడియం సైజ్ అరటిపండు 320 నుంచి 400 మిల్లీ గ్రాముల పొటాసియం ఖనిజాన్ని కలిగి ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 10 శాతం పొటాషియంను అందిస్తుంది. 

శక్తి ఉత్పాదకం

ఒక్క అరటిపండు తింటే చాలు.. కొవ్వు లేకుండా సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్  వంటి మూడు రకాల చక్కెరలను అందిస్తూ.. మనకు సహజ శక్తిని అందిస్తుంది.
అయితే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ .. అరటిపండు తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు.. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.