ఫోన్ దొంగిలించాడని... బోటుకు వేలాడిదీసి కొట్టారు

ఫోన్ దొంగిలించాడని... బోటుకు వేలాడిదీసి కొట్టారు

బెంగళూరు: సెల్​ ఫోన్ దొంగిలించాడని ఓ మత్స్యకారుడిని తోటి మత్స్యకారులు బోటుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఈ నెల 15న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌‌లో లంగరు వేసిన బోటులో ఈ ఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బాధితుడు వైలా శీను అని గుర్తించారు. బోటులోని వేయింగ్ మెషీన్​కు ఉండే హుక్​కు శీనును తలకిందులుగా వేలాడదీసి, తాళ్లతో కట్టేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ కేసులో ఆ గ్యాంగ్​కు చెందిన మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశామని, వారంతా ఆంధ్రప్రదేశ్​కు చెందినవారని మంగళూరు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు పెట్టి విచారిస్తున్నట్లు వెల్లడించారు.