Kiki Hakansson: తొలి ప్రపంచ సుందరి కికీ కన్నుమూత..95 వయసులో నిద్రలోనే..

మొదటి ప్రపంచ సుందరి (First Miss World), స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్ (95) (Kiki Hakansson) నవంబర్ 4, సోమవారం కాలిఫోర్నియాలోని తన స్వగృహంలో  కన్నుమూశారు.

కికీ నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసిందంటూ తన కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కికీ హకాన్సన్ ఫోటో షేర్ చేస్తూ "కికీ శాంతియుతంగా, హాయిగా మరియు ప్రశాంతంగా కన్నుమూసిందంటూ "పోస్ట్ చేశారు.

ఆమె కుమారుడు, క్రిస్ ఆండర్సన్ తన తల్లికి నివాళులర్పిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. "ఎప్పుడు ప్రేమతో సరదాగా గడిపే అమ్మ..ఇపుడు మా మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోంది. తన అద్భుతమైన హాస్యం మరియు తెలివి మమల్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాయి" అని గుర్తు చేసుకున్నాడు. 

ALSO READ : Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్‌’ డిజాస్టర్‌పై రానా వెటకారం.. ఎన్నో విన్నానంటూ డైరెక్టర్ హరీశ్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్

అలాగే 1960వ నుండి ప్రపంచ సుందరి పోటీలను నిర్వహిస్తున్న జూలియా మోర్లీ ఎమోషనల్ ట్వీట్ చేసింది. "కికీ హకాన్సన్ నిజమైన మార్గదర్శకురాలు.. ఈ క్లిష్ట సమయంలో మా ప్రేమను పంపుతూ మరియు మా ప్రార్థనలను అందిస్తూ, కికీ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని జూలియా మోర్లీ అన్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miss World (@missworld)