దేశంలోనే తొలి విదేశీ విశ్వవిద్యాలయం..సౌతాంప్టన్​ యూనివర్సిటీ

  • నూతన జాతీయ విద్యావిధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్​షోర్​ క్యాంపస్​ 

గురుగ్రామ్​లో బ్రిటన్​కు చెందిన సౌతాంప్టన్​ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్​ ఇండెంట్​ను విదేశాంగ మంత్రి జైశంకర్​ యూనివర్సిటీ ప్రతినిధులకు అందజేశారు. 

మన దేశంలో సౌతాంప్టన్​ యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రదానం చేసే డిగ్రీలు బ్రిటన్​లో ఆ విశ్వవిద్యాలయం ప్రదానం చేసే డిగ్రీలతో సమానంగా ఉంటాయి. విద్యా, నాణ్యత ప్రమాణాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. 

Also Read :- జపాన్​యానిమేటర్కు రామన్ మెగసెసె అవార్డ్స్​ 2024

సౌతాంప్టన్​ భారత క్యాంపస్ లో 2025, జులై నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తొలుత బిజినెస్​, మేనేజ్​మెంట్​, కంప్యూటింగ్​, లా, ఇంజినీరింగ్​, ఆర్ట్​, డిజైన్​, బయో సైన్సెస్​, లైఫ్​​ సైన్సెస్​ కోర్సులు అందుబాటులోకి వస్తాయి.