మొదటి విడత 3 కోట్ల మందికి వ్యాక్సిన్

మొదటి విడత 3 కోట్ల మందికి వ్యాక్సిన్
హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కే ప్రయారిటీ జులై నాటికి 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌‌‌‌పై త్వరలో నిర్ణయం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి న్యూఢిల్లీ: ఫస్ట్ ఫేజ్ లో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్  వేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఫస్ట్ ఫేజ్​లో కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫ్రీగా టీకా ఇస్తామని చెప్పారు. జులై నాటికి మరో 27 కోట్ల మందికి ఎలా వ్యాక్సిన్ అందించాలనే విషయాన్ని త్వరలో ఫైనల్ చేస్తామన్నారు. 27 కోట్ల మందిలో 50 ఏండ్లు పైబడిన, అంతకు తక్కువ ఏజ్ ఉండి కమోర్బిడిటీస్ ఉన్నవారికి ప్రయారిటీ ఇస్తామని తెలిపారు. శనివారం ఢిల్లీలో జీటీబీ హాస్పిటల్​ను సందర్శించి వ్యాక్సిన్ డ్రైరన్ పై రివ్యూ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ఎక్స్ పర్ట్ కమిటీ రెకమండేషన్ పై డీసీజీఐ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. వ్యాక్సిన్ సేఫ్టీపై వదంతులు నమ్మొద్దు. వ్యాక్సిన్​కు ఆమోదం తెలిపేటప్పుడు ప్రొటోకాల్ లో ఎలాంటి రాజీ లేదు. పోలియో వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా రూమర్స్ వచ్చాయి. వ్యాక్సినేషన్ తర్వాత సేఫ్టీపై ప్రజలకు నమ్మకం వచ్చింది’ అని అన్నారు. పుణెకు చెందిన సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు ఎక్స్ పర్ట్ కమిటీ ఓకే చెబుతూ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి సిఫార్సు చేసిన మరుసటి రోజే హర్షవర్ధన్ ఈ కామెంట్స్ చేశారు. ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్: ఢిల్లీ హెల్త్ మినిస్టర్ నేషనల్ క్యాపిటల్ లోని ప్రజలందరికీ  ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. శనివారం దరియాగంజ్ లో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ లో డ్రై రన్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీలో కరోనా వ్యాక్సినేషన్ కోసం వెయ్యి సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తాం. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ వస్తే ఎమర్జెన్సీ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరినీ అరగంటపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతాం. రోజుకు లక్ష మంది వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేశాం’ అని  మంత్రి సత్యేందర్​ జైన్​ తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చేటోళ్లకు సెల్ఫ్ పెయిడ్ టెస్టులు ఈ నెల 8 నుంచి 30 వరకు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు సెల్ఫ్ పెయిడ్ కరోనా టెస్టు తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు శనివారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) జారీ చేసింది. జర్నీకి 72 గంటల ముందే టెస్టు చేయించుకుని కరోనా నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకోవాలని సూచించింది. బ్రిటన్​లో కొత్త స్ట్రెయిన్ రావడంతో డిసెంబర్ 23 నుంచి 31 వరకు ఆ దేశానికి అన్ని ఫ్లైట్లను నిలిపివేసింది. దాన్ని ఈ నెల 7 వరకు పొడిగించింది. 8 నుంచి ఇండియా, బ్రిటన్ మధ్య ఫ్లైట్​ సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తామని, వారానికి 30 ఫ్లైట్లకు అనుమతిస్తామని ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి శుక్రవారం ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్